ఎండాకాలం వచ్చేస్తోంది. మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. ఈ కాలంలో చికెన్, మటన్ కంటే చేపలను డైట్‌లో చేర్చుకోవడం ఎంతో మేలు చేస్తుంది. చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చేపలు శరీరాన్ని డీ-హైడ్రేషన్ నుంచి కాపాడుతాయి.
ముఖ్యంగా సాల్మన్ ఫిష్‌ను వారానికోసారి సమ్మర్లో తీసుకోవడం ద్వారా మోకాళ్ల నొప్పులుండవు. హృద్రోగానికి చేపలు మేలు చేస్తాయి. నాడీ వ్యవస్థకు మేలు చేస్తాయి. చేపల్లోని పోషకాలు నిద్రలేమిని దూరం చేస్తాయి. ఇన్ని ప్రయోజనాలున్న చేపలతో గ్రేవీలతో బోర్ కొట్టేస్తే వెరైటీగా ఆవ నూనెతో ఫ్రై చేసి చూడండి.. ఎలా చేయాలంటే..?
శుభ్రం చేసిన చేప ముక్కలకు ఉప్పు, పసుపు పట్టించాలి. అల్లం పేస్ట్‌ను కూడా చేప ముక్కలకు పట్టించాలి. అరగంట తర్వాత చేపల మిశ్రమాన్ని పక్కనబెట్టాలి. స్టౌపై బాణలి పెట్టి ఆవనూనె పోసి.. వేడయ్యాక అందులో చేప ముక్కలను సగం వేగాక ప్లేటులోకి తీసుకోవాలి. మిగిలిన ఆవనూనెలో ఎండు మిర్చిని వేపాలి. అల్లం పేస్ట్ ఒక స్పూన్ చేర్చి దోరగా వేపాలి, పసుపు పొడి, ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్ చేర్చాలి.