ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అరుదైన గౌరవం లభించింది. పశ్చిమాఫ్రికా దేశమైన ఘనా తమ దేశ అత్యున్నత పురస్కారమైన "ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా"ను ప్రకటించింది. నరేంద్ర మోడీ విశిష్ట రాజనీతిజ్ఞత, ప్రపంచ వ్యాప్తంగా ఆయన చూపిస్తున్న ప్రభావంతమైన నాయకత్వానికి గుర్తింపుగా ఈ అవార్డును ప్రదానం చేస్తునట్టు ఘనా పాలకులు ప్రకటించారు.
ఐదు దేశాల పర్యటనలో భాగంగా ఘనా చేరుకున్న ప్రధాని మోడీకి ఆ దేశ అధ్యక్షుడు జాన్ ద్రమాని మహామ స్వయంగా ఆ పురస్కారాన్ని అందజేశారు. ఈ గౌరవం పట్ల ప్రధాని మోడీ కృతజ్ఞలు తెలిపారు. ఈ పురస్కారం తన వ్యక్తిగతం కాదని, 140 కోట్ల మంది భారత ప్రజల తరపున దీనిని స్వీకరిస్తున్నట్టు ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ గౌరవాన్ని దేశ యువతకు భారత గొప్ప సాంస్కృతిక వారసత్వానికి, భారత్ - ఘనా దేశాల మధ్య ఉన్న చిరకాల మైత్రికి అంకితమిస్తున్నట్టు తెలిపారు.