చైనా 6G మొబైల్ వైపు అడుగు వేసింది. సబ్-7GHz ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లో పనిచేసేలా రూపొందించిన కొత్త బేస్‌బ్యాండ్ ప్రోటోటైప్‌ను చైనా ఆవిష్కరించింది. Zhongguancun పాన్-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ, చైనా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మొబైల్, వివో భాగస్వామ్యంతో దీనిని డెవలప్ చేశారు. హై-స్పీడ్ డేటా ప్రాసెసింగ్, మల్టీ-బ్యాండ్ అడాప్టబిలిటీ ద్వారా 6Gని వేగవంతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.