శ్రీ సిద్ధగంగా ఎడ్యూకేషన్ సొసైటీ పేరిట 125 విద్యాసంస్థలను నెలకొల్పి పేద పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నారు. ఈ సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం 2015లో స్వామిజీకి పద్మభూషణ్ అవార్డును అందజేసింది. మఠంలో సిద్దం చేసిన సమాధి వద్ద భక్తులు భారీగా చేరుకున్నారు. ఈ సందర్బంగా స్వామీజీని కడసారి చూపు కోసం ఉంచిన అనంతరం అంతిమ సంస్కారాలను పూర్తి చేశారు.