ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుత త్రైమాసికం చివరి నాటికి కంపెనీ ఎన్ఐఎల్ఎల్ కొనుగోలు పూర్తి చేయాలని టాటా స్టీల్ ఈసీఈ, మేనేజింగ్ డైరెక్టర్ టివి.నరేంద్రన్ తెలిపారు. ఎయిర్ ఇండియా కొనుగోలు కోసం టాటా గ్రూపు రూ.18 వేల కోట్లకు బిడ్ దాఖలు చేసిన విషయం తెల్సిందే.
ప్రస్తుతం ఎన్ఐఎన్ఎల్‌ను సొంతం చేసుకునేలా ప్లాన్ చేసింది. ఒడిషా రాష్ట్రంలోని ఈ ఉక్కు తయారీ కర్మాగారంలో 93.71 శాతం వాటాను రూ.12100 కోట్లకు కొనుగోలు చేసేందుకు టాటా స్టీల్ జనవరి 31వ తేదీన విన్నింగ్ బిడ్ ప్రకటించిన విషయం తెల్సిందే. కాగా, ప్రస్తుతం ఈ కంపెనీ రూ.6600 కోట్ల మేరకు బకాయిపడింది. దీంతో ప్రభుత్వం వదిలించుకునేందుకు ప్రయత్నించగా, దాన్ని టాటా గ్రూపు సొంతం చేసుకునేందుకు సిద్ధమైంది.