టిప్పు సుల్తాన్ వ్యవహారం ఇపుడు దేశంలో చర్చనీయాంశమైంది. టిప్పు సుల్తాన్ను బీజేపీ దేశ ద్రోహిగా అభివర్ణించింది. కానీ, రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ మాత్రం ఆయనో పోరాట యోధుడు అంటూ అభివర్ణించారు. దీంతో ఈ వివాదం మరింతగా రాజుకున్నట్టయింది.
కానీ, బీజేపీ మాత్రం ఆయనను దేశ ద్రోహిగా అభివర్ణించింది. ఫలితంగా ఈ వేడుకల బహిష్కరణకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో బీజేపీ వైఖరితో కోవింద్ వ్యాఖ్యలు విభేదిస్తుండటంతో ఇది హాట్ టాపిక్ అయింది. కోవింద్ వైఖరితో టిప్పు సుల్తాన్ స్వాతంత్ర సమరయోధుడని చెబుతున్న కర్ణాటక సర్కార్ వాదనకు బలం చేకూరుతుండటం బీజేపీ నేతలకు రుచించడం లేదు.