యావత్ దేశంలో పొదుపులో నగరవాసులు నెం.1గా ఉన్నారని ది గ్రేట్ ఇండియన్ వాలెట్ నిర్వహించిన అధ్యయనంలో తాజాగా వెల్లడైంది. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో మధ్యతరగతి జీవనంపై జరిపిన ఈ అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.
ఆర్థిక క్రమశిక్షణలో తమకు మించిన వారు లేరని హైదరాబాదీలు నిరూపించారు. యావత్ దేశంలో పొదుపులో నగరవాసులు నెం.1గా ఉన్నారని ది గ్రేట్ ఇండియన్ వాలెట్ నిర్వహించిన అధ్యయనంలో తాజాగా వెల్లడైంది.
ఈ అధ్యయనం ప్రకారం, మధ్యతరగతి ప్రజలకు అనుకూల నగరంగా హైదరాబాద్ వరుసగా రెండోసారి ద్వితీయస్థానంలో నిలిచింది. బెంగళూరు మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది.