దసరా పండుగకు ప్రత్యేక బస్సులు ప్రకటించిన టీజీ ఆర్టీసీ

ఠాగూర్

మంగళవారం, 8 అక్టోబరు 2024 (10:10 IST)
దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక బస్సులను నడుపనుంది. దసరా పండుగ నేపథ్యంలో ప్రజలు సొంతూళ్లకు వెళ్లేందుకు వీలుగా ఈ ప్రత్యేక బస్సులను నడుపనున్నట్టు తెలిపింది. ముఖ్యంగా, తెలుగు రాష్ట్రాలకు చెందిన వలసజీవులు హైదరాబాద్ నుంచి తమ స్వస్థలలాకు వెళుతున్నారు. దాంతో, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు విపరీమైన రద్దీతో కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ దసరా స్పెషల్ బస్సులు ప్రకటించింది.
 
దసరా డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని 6,304 ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని టీజీఎస్ఆర్టీసీ ఎంపీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. బతుకమ్మ, దసరా పండుగలకు తమ సొంతూళ్లకు వెళ్లే వాళ్లు ఇబ్బంది పడకుండా, వేల సంఖ్యలో ప్రత్యేక బస్సులు తిప్పుతున్నామని సజ్జనార్ వివరించారు. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అమల్లో ఉన్నందున, గతేడాదితో పోల్చితే అదనంగా మరో 600 బస్సులు నడుపుతున్నామని వెల్లడించారు. ఈ నెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు రద్దీ ఉంటుందని భావిస్తున్నామని సజ్జనార్ తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు