పందెం కోడి హీరో విశాల్ పెళ్లిపై రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తొలుత వరలక్ష్మితో ప్రేమ, ఆపై మరో యువతితో నిశ్చితార్థం.. ప్రస్తుతం హీరోయిన్ ధన్షికతో వివాహం జరగబోతుందనే వార్తలు వచ్చాయి. ధన్షిక కూడా విశాల్‌తో పెళ్లి వార్తలను కన్ఫామ్ చేసింది. వీరిద్దరి వివాహం ఆగస్టు 29వ తేదీన జరుగుతుందని ప్రకటించారు.
అయితే ఈసారి తన పుట్టిన రోజైన ఆగస్టు 29వ తేదీన పెళ్లి గురించి సరైన ప్రకటన చేస్తానని చెప్పాడు. ఇంతలో నడిగర్ సంఘం బిల్డింగ్ పనులు కూడా పూర్తవుతాయని చెప్పాడు. ఆ నడిగర్ సంఘం బిల్డింగ్‌లోనే తన పెళ్లి జరుగుతుందని.. ఇప్పటికే హాలును కూడా బుక్ చేశానని విశాల్ తెలిపాడు. దీంతో ఆగస్టు 29న విశాల్ పెళ్లి వుండదనే విషయాన్ని చెప్పకనే చెప్పేశాడు.