Akshay Kumar, Vishnu Manchu
ముంబైలో జరిగిన ప్రత్యేక మీడియా ఈవెంట్‌లో కన్నప్ప టీజర్‌ను ఆవిష్కరించారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్, నటుడు, నిర్మాత విష్ణు మంచు, దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ ఈ కార్యక్రమంలో సందడి చేశారు. సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీ వినయ్ మహేశ్వరి ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ప్రత్యేకంగా ప్రదర్శించిన ఈ కన్నప్ప టీజర్ అందరినీ ఆకట్టుకుంది. అక్కడి మీడియా ప్రతినిధులు కన్నప్ప టీజర్ మీద ప్రశంసలు కురిపించారు.