జనసేన అధినేత శ్రీ పవన్ కల్యాణ్ గురించి సీనియర్ నరేష్ ఏమన్నారో తెలుసా?

గురువారం, 17 జనవరి 2019 (22:23 IST)
నటుడు సీనియర్ నరేష్. కొన్నాళ్లు భాజపాలో పనిచేసి ఆ తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసి సినిమాల్లో బిజీ అయ్యారు. తాజాగా ఏపీ రాజకీయాలపై ఓ ఛానల్‌తో మాట్లాడుతూ... తెలుగు ఓటర్లు చాలా తెలివైనవారు. ఏపీలో ఎట్టి పరిస్థితుల్లో హంగ్ రాదు. కానీ వారు ఏ పార్టీకి పట్టం కడతారన్నది వేచి చూడాలి. 
 
నా ఉద్దేశ్యంలో పవన్ కల్యాణ్ ది బెస్ట్ లీడర్. రాజకీయాల్లోకి మంచి ఉద్దేశ్యంతో వచ్చారు. ఓ కార్యకర్తలా పనిచేసుకుంటూ వెళ్తున్నారు. పవన్ కల్యాణ్ గారికి యూత్‌లో మంచి ఫాలోయింగ్ వుంది. పవన్ కళ్యాణ్ గారంటే నాకు చాలా ఇష్టం. ఆయన కూడా నాలాగా రైతు. పొలంలో ఎంత కష్టపడి పనిచేస్తున్నారో అలాగే ఇప్పుడు రాజకీయాల్లోనూ చేస్తున్నారు.
 
ఇక జగన్ మోహన్ రెడ్డి గారికి మంచి పట్టు వుంది. చంద్రబాబు పాలన సాగుతున్నా ఎక్కడో వ్యతిరేకత కనబడుతోంది. మరి ఇవన్నీ చూస్తున్న తెలుగు ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో" అంటూ చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు