అయోధ్య కేసు.. సుప్రీం కోర్టు తుది తీర్పు నేడే.. తెరుచుకోని పాఠశాలలు.. భారీ భద్రత

శనివారం, 9 నవంబరు 2019 (09:17 IST)
అయోధ్య కేసులో సుప్రీం కోర్టు తుది తీర్పు వెలువడనుంది. అయోధ్యలోని 2.77 ఎకరాల భూమికి సంబంధించినది ఈ వివాదం. ఈ ప్రదేశం శ్రీరామచంద్రస్వామి పుట్టిన ప్రదేశంగా హిందువులు భావిస్తున్నారు. ఐతే... ఇదే ప్రదేశంలో 16వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి బాబర్... ఓ మసీదును నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. దీనిపై 1992లో హిందుత్వవాదులు అభ్యంతరం చెప్పారు.

అప్పట్లో బాబ్రీమసీదు కూల్చివేత ఘటన జరిగి... ఆ తర్వాత దేశవ్యాప్తంగా జరిగిన అల్లర్లలో దాదాపు 2వేల మంది ప్రాణాలు కోల్పోయారు. శనివారం సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుపై అందరికీ ఆసక్తి ఉంది. అలాగే ప్రభుత్వాలకు టెన్షనూ ఉంది. ఏ తీర్పు ఇచ్చినా... దాన్ని చక్కగా స్వాగతించి... సర్దుకుపోతే ఏ సమస్యా ఉండదని అన్ని ప్రభుత్వాలూ కోరుతున్నాయి.
 
సుప్రీంకోరు ఎలాంటి తీర్పు ఇచ్చినా అందరూ సంయమనంతో తీర్పును స్వాగతించాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పిలుపు నిచ్చారు. ఇంకా ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, జమ్మూ, కర్ణాటకలో ఇవాళ స్కూళ్లు, విద్యాసంస్థలు తెరచుకోవట్లేదు. యూపీలో ఏకంగా సోమవారం సెలవులు ప్రకటించారు. శనివారం ఉదయం పదిన్నరకు సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇవ్వనుంది.
 
అయోధ్య కేసుపై దాదాపు 40 రోజులపాటూ విచారించిన సుప్రీంకోర్టు... అక్టోబర్ 16న తీర్పును రిజర్వులో ఉంచింది. అప్పటి నుంచీ ఇప్పటివరకూ... కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం... శాంతి భద్రతలకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ చేసుకున్నాయి. అంతా కంట్రోల్‌లో ఉందని క్లారిటీ వచ్చాక... తీర్పు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు సిద్ధమైంది.
 
అయోధ్యలోని 2.77 ఎకరాల భూమికి సంబంధించినది ఈ వివాదం. ఈ ప్రదేశం శ్రీరామచంద్రస్వామి పుట్టిన ప్రదేశంగా హిందువులు భావిస్తున్నారు. ఐతే... ఇదే ప్రదేశంలో 16వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి బాబర్... ఓ మసీదును నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. దీనిపై 1992లో హిందుత్వవాదులు అభ్యంతరం చెప్పారు. అప్పట్లో బాబ్రీమసీదు కూల్చివేత ఘటన జరిగి... ఆ తర్వాత దేశవ్యాప్తంగా జరిగిన అల్లర్లలో దాదాపు 2వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు