పబ్లిక్ పార్కులో 7 టన్నుల రంగోలీ పొడితో సోనూసూద్ చిత్రపటం

శనివారం, 28 జనవరి 2023 (21:36 IST)
sonusood
రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా మహారాష్ట్రలోని కొల్హాపూర్ నగరంలో 87,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో తన చిత్రపటాన్ని రూపొందించారు. ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ నటుడు సోనూసూద్ షాకయ్యాడు. మిరాజ్‌కర్‌కు చెందిన కళాకారులుడు పబ్లిక్ పార్కులో 7 టన్నులకు పైగా రంగోలీ పౌడర్‌ని ఉపయోగించి సోనూసూద్ చిత్రపటాన్ని గీశాడు. 
 
ఈ సోనూసూద్  87,000 చదరపు అడుగుల అతిపెద్ద సోనూసూద్ రంగోలి ప్రపంచ రికార్డును నెలకొల్పడానికి రూపొందించినట్లు తెలిపారు. ఈ ఫోటో ప్రస్తుతం ప్రతిరోజూ వేలాది మంది సందర్శకులను ఆకర్షిస్తోంది. ఇకపోతే.. కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రజల పట్ల సోనూ సూద్ ఆపద్భాంధవుడిగా నిలిచాడు. కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో వలసదారులు ఇంటికి చేరుకోవడంలో సాయం చేశాడు.
 
సోనూసూద్ తాజాగా 'ఫతే'లో కనిపించనున్నాడు. ఇది నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కనుంది. యాక్షన్-థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి 'బాజీరావ్ మస్తానీ', 'శంషేరా' వంటి చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన అభినందన్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. 'ఫతే' తర్వాత సోనూసూద్ మరో చిత్రం 'కిసాన్‌'ని ప్రారంభించనున్నారు  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు