గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, జల్‌జీవన్ మిషన్ ద్వారా కేంద్రం అందించే నిధులను ఇందుకోసం సద్వినియోగం చేసుకుందామని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చెప్పారు.
ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జల్‌జీవన్‌మిషన్ ద్వారా రాష్ట్రానికి పంపిన నిధులను గత ప్రభుత్వం సక్రమంగా వినియోగించలేదన్నారు. క్షేత్రస్థాయి ఇంజనీరింగ్ సిబ్బందికి ఓరియెంటేషన్ కార్యక్రమం చేపట్టాలన్నారు. ఎస్‌ఈలు, ఈఈలతో వర్క్‌షాపును వచ్చే నెల 8న నిర్వహించాలని నిర్ణయించారు.