ఏపీలో ఒక్కసారిగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు - మన్యం వణికిపోతోంది..

గురువారం, 17 నవంబరు 2022 (09:14 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు అమాంతం పడిపోతున్నాయి. చింతపల్లిలో బుధవారం 8.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మంగళవారం ఇది 13 డిగ్రీలుగా ఉంది. మున్ముందు మరింతగా తగ్గిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. 
 
రాష్ట్రంలో బుధవారం నుంచి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు చలి దెబ్బకు వణికిపోతున్నారు. ఇక మన్యం ప్రాంతమైన పాడేరు మండలంలోని మినుములూరు కాఫీ బోర్డులో 10.1 డిగ్రీలు, పాడేరులో 12 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత నమోదైంది. 
 
గురువారం తెల్లవారుజాము 4 గంటల నుంచి 9 గంటల వరకు మన్యం ప్రాంతం మొత్తం పొగమంచుతో తడిసి ముద్దయిపోయింది. ఒక్కటంటే ఒక్క ప్రాంతం కూడా మంచు దెబ్బకు కంటికి కనిపించలేదు. దీంతో ఉదయం బయటకు రావాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు