నిజానికి ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం షెడ్యూల్ విడుదలైంది. అయితే, రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోరని తెలుస్తోంది. రాజధాని గ్రామాలను ప్రత్యేక కార్పొరేషన్ పరిధిలోకి తీసుకువస్తుండడం ఓ కారణమైతే, కొన్నిగ్రామాలను ఇతర మున్సిపాలిటీల్లో విలీనం చేస్తుండటం మరో కారణంగా ఉంది.
తుళ్లూరు మండలంలోని గ్రామాలతో పాటు నీరుకొండ, నిడమర్రు, కృష్ణాయపాలెం, కురగల్లు గ్రామాలను కలుపుకుని అమరావతి కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా, మంగళగిరి పురపాలికల్లో బేతపూడి, నవులూరు, యర్రబాలెం గ్రామాలను కలపాలని, తాడేపల్లి మున్సిపాలిటీలో ఉండవల్లి, పెనుమాక గ్రామాలను కలపాలని ప్రతిపాదనలను తెరపైకి తెచ్చారు.