అమరావతి తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసం వద్దకు ప్రజలు భారీ ఎత్తున తరలి వస్తున్నారు. ప్రజలతో పాటు పలు విభాగాల ఉద్యోగులు ప్లకార్డులతో సమస్యలు తెలియజేస్తూ తమను కలిసేందుకు సీఎం అవకాశం ఇవ్వాలని కోరుతూ నినాదాలు చేశారు. అలాగే మాజీ ఏసీబీ డీజీ ఆర్పీ ఠాగూర్‌కు వ్యతిరేకంగా సీఎం నివాసం వద్ద కొందరు ఉద్యోగుల నిరసన తెలిపారు.
రాష్ట్రంలోని 13జిల్లాల నుంచి తరలివచ్చిన పలు విభాగాల్లోని ఉద్యోగులు చంద్రబాబు మెప్పుకోసం తమపై అక్రమ కేసులు బనాయించారంటూ ఫ్లెక్సీలతో ఉద్యోగుల ప్రదర్శన చేశారు. టీడీపీ నేతలకు సహకరించలేదని ఠాగూర్ పెట్టిన తప్పుడు కేసులపై రివ్యూ చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ తొత్తుగా వ్యవహరించి వందలాది కుటుంబాలను ఇబ్బందిపెట్టిన ఠాగూర్‌ని సస్పెండ్ చేయాలిని డిమాండ్ చేశారు.
బాధితులు తొమ్మిదేళ్లుగా ఏసీబీలో బదిలీలు లేవని, వెంటనే బదిలీలు చేయాలని కోరారు. సీఎం నివాసం వద్ద ఆందోళన కొనసాగిస్తోన్న గోపాల మిత్రలు గ్రామ సచివాలయాల్లో శాశ్వత ఉద్యోగులుగా నియమించాలని డిమాండ్‌తో గోపాలమిత్రల ఆందోళన శ్రీశైలం ప్రాజెక్టులో భూములు కోల్పోయిన వారికి ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని నిర్వాసితుల డిమాండ్ చేశారు.