టీడీపీ నేత, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ మరణంతో విషాదం చోటుచేసుకుంది. ఈ విషాద సమయంలో ధైర్యంగా ముందుకు వెళ్లే శక్తిని కుటుంబ సభ్యులకు భగవంతుడు ఇవ్వాలని.. తన తరపున జనసేన శ్రేణుల తరఫున ఆయనకు నివాళులు అర్పిస్తున్నానని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్నారు. హరికృష్ణ మరణంపై పవన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో పవన్ ఓ లేఖను పోస్టు చేశారు.
హరికృష్ణ మృతి నేపథ్యంలో నేటి జనసేన అధికారిక కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. సినీ, రాజకీయ రంగాల్లో ఆయన చేసిన సేవలు మరచిపోలేనివని పవన్ వ్యాఖ్యానించారు. పవన్, హరికృష్ణ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.