భార్యపై కేసు పెట్టారు... తల్లిపై ఒట్టేసి చెప్తున్నా.. పేర్ని నాని

సెల్వి

శనివారం, 28 డిశెంబరు 2024 (20:19 IST)
పీడీఎస్ బియ్యం కుంభకోణంలో ప్రమేయం ఉందనే ఆరోపణలపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. తమ గోడౌన్‌లో బియ్యం తగ్గిందని అధికారులు చెప్పారని.. నైతిక బాధ్యత వహిస్తూ తన సతీమణి అధికారులకు ఒక లేఖ రాశారని గుర్తు చేశారు. టెక్నికల్‌గా తమ బాధ్యత లేకున్నా.. నైతికంగా బాధ్యత వహిస్తామని ఆ లేఖలో పేర్కొన్నారు.  అధికారులు తనిఖీలు చేసి 3,800 బస్తాలు తగ్గాయన్నారు. దాని తాలూకు వారి చెప్పినట్లుగా నగదు చెల్లించామని పేర్ని నాని వెల్లడించారు. 
 
అయినా సరే తమపై కక్ష కట్టి తన భార్య, గోడౌన్‌ ఇన్‌చార్జి మీద కేసు నమోదు చేశారన్నారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్తే రకరకాల కుట్రలు చేశారని పేర్ని నాని ఆరోపించారు. తన భార్య గురించి యూట్యూబ్‌లో కొంతమంది దారుణమైన వ్యాఖ్యలు చేశారని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
అధికారులు అడిగినట్లు డబ్బులు కట్టాక కూడా క్రిమినల్ కేసులు పెట్టారని విమర్శించారు. తన తల్లి మీద ప్రమాణం చేసి చెబుతున్నానని.. తాము ఏ తప్పుడు పని చేయలేదని మాజీ మంత్రి స్పష్టం చేశారు. తాను పారిపోయానని తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు