పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర- రూ.16.5లుగా పెంపు

సెల్వి

ఆదివారం, 1 డిశెంబరు 2024 (11:49 IST)
అంతర్జాతీయ చమురు ధరల ట్రెండ్‌లకు అనుగుణంగా చేసిన నెలవారీ సవరణలో జెట్ ఇంధనం లేదా ఏటీఎఫ్ ధర ఆదివారం 1.45 శాతం పెరిగింది. దీంతో కమర్షియల్ సిలిండర్ ధరలు పెరిగాయి.  హోటళ్లు, రెస్టారెంట్లలో ఉపయోగించే వాణిజ్య ఎల్పీజీ ధరలు 19 కిలోల సిలిండర్‌కు రూ. 16.5 చొప్పున పెరిగాయి. 
 
ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ATF) ధర కిలోలీటర్‌కు రూ. 1,318.12 లేదా 1.45 శాతం పెరిగి, జాతీయ రాజధాని ఢిల్లీలో కిలోలీటర్‌కు రూ. 91,856.84కి పెరిగింది.  
 
ఇంధన ధరలు నెలవారీగా పెరగడం ఇది వరుసగా రెండోసారి. నవంబర్ 1న లీటర్‌కు రూ. 2,941.5 (3.3 శాతం) చొప్పున ధరలు పెంచబడ్డాయి. చమురు సంస్థలు కూడా 19 కిలోల సిలిండర్‌పై కమర్షియల్‌ ఎల్‌పిజి ధరను రూ.16.5 పెంచి రూ.1818.50కి పెంచాయి. 
 
వాణిజ్య LPG ధరలో ఇది వరుసగా ఐదవ నెలవారీ పెంపు. నవంబర్ 1న జరిగిన చివరి సవరణలో 19 కిలోల సిలిండర్‌పై 62 రూపాయలు పెంచారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు