ఆంధ్ర- తెలంగాణ రైతులకు సుకృతిని కానుకగా తీసుకువచ్చిన క్షేమ

ఐవీఆర్

మంగళవారం, 18 జూన్ 2024 (22:49 IST)
క్షేమ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ ఈ ఖరీఫ్ సీజన్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జంట రాష్ట్రాలలో ప్రకృతితో పాటు తమ ప్రతిష్టాత్మక పంట బీమా ప్రొడక్ట్ సుకృతిని అందుబాటులో ఉంచుతున్నట్లు వెల్లడించింది. ఈ రెండు రాష్ట్రాల్లోని రైతులు ఇప్పుడు ఎకరాకు కేవలం ప్రారంభ ధర రూ .499 తో 100కు పైగా కాలానుగుణ పంటలను కాపాడుకోవచ్చు. రాష్ట్రం, దేశం కోసం ఆహారాన్ని పండించే ప్రయత్నంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని రైతులు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ప్రకృతి ప్రకోపం వాటిలో ఒకటి. అసాధారణమైన వాతావరణ సంఘటనలు మరింత తీవ్రంగా, తరచుగా ఎదురవుతున్నాయి. ఇవి రైతులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి, పంట నష్టాన్ని కలిగిస్తున్నాయి, ఆదాయ నష్టాలకు దారితీస్తున్నాయి.
 
అయితే, రైతులు ఈ ఖరీఫ్ సీజన్‌లో క్షేమ యొక్క వినూత్నమైన పంట బీమా ఉత్పత్తి సుకృతితో తమ ఆదాయాన్ని కాపాడుకోవచ్చు. ముందుగా నిర్ణయించిన తొమ్మిది విపత్తుల జాబితా నుండి వారి పంటను ఎక్కువగా దెబ్బతీసే అవకాశం ఉన్న ఒక పెద్ద, ఒక చిన్న విపత్తు కలయికను ఎంచుకోగల అవకాశం రైతుకు అసమానమైన సౌలభ్యాన్ని అందిస్తుంది. వారు వాతావరణం, ప్రాంతం, వారి పొలం యొక్క స్థానం, చారిత్రక నమూనా ఆధారంగా ఈ ఎంపిక చేసుకోవచ్చు. కోస్తా ఆంధ్రకు చెందిన ఒక రైతు, ఎక్కువగా వచ్చే వరదలు, తుఫానుల నుండి తన పంటను కాపాడేందుకు బీమా  ఎంచుకోవచ్చు. అదేవిధంగా, తెలంగాణకు చెందిన ఒక సాగుదారుడు వడగళ్ల వాన, జంతువుల దాడిని ఎంచుకోవచ్చు.
 
క్షేమ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ చీఫ్ అండర్ రైటింగ్ ఆఫీసర్ సి.వి. కుమార్ మాట్లాడుతూ, “మేము రైతులు, వారి సవాళ్లను అర్థం చేసుకున్నాము. రైతుల బీమా అవసరాలను తీర్చేందుకు సుకృతిని రూపకల్పన చేస్తున్నప్పుడు మేము అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్నామని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. రైతుల బీమా అవసరాలను తీరుస్తామనే భరోసా అందిస్తూనే, ఆదాయ నష్టాల నుండి వారిని రక్షించే మా లక్ష్యం కూడా దీనితో నెరవేరుతుంది. సుకృతి సరసమైనది, అనుకూలీకరించదగినది. దీని అపూర్వమైన లక్షణం ఏమిటంటే ప్రతి రైతు తమ అవసరాలు, లక్ష్యాలకు అనుగుణంగా దీనిని రూపొందించుకోవచ్చు. ఇది అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా బీమా మొత్తాన్ని పెంచుకునే అవకాశాన్ని ఇస్తుంది. రైతులు సుకృతిని కొనుగోలు చేయడానికి, క్లెయిమ్‌లను దాఖలు చేయడానికి మేము ప్రక్రియను కూడా సులభతరం చేసాము" అని అన్నారు.
 
గుగూల్ ప్లే స్టోర్  నుండి క్షేమ యాప్‌ను రైతులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, కొన్ని సులభమైన దశల్లో సుకృతిని కొనుగోలు చేయవచ్చు. రైతులు తమ పంట, గ్రామం, తమ పొలాన్ని జియో ట్యాగ్ చేయడం, ప్రీమియం మొత్తాన్ని తనిఖీ చేయడం, బీమా మొత్తాన్ని తనిఖీ చేయడం, కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయడానికి కెవైసి ధృవీకరణ చేయడం కోసం యాప్ అనుమతిస్తుంది. పాయింట్ ఆఫ్ సేల్ పర్సన్స్ (పిఓఎస్ పిలు)ని కూడా క్షేమ నియమించింది, ఏ దశలోనైనా సహాయం అవసరమయ్యే రైతులకు సహాయం అందించడానికి వీరు సిద్ధంగా వుంటారు. ఒక రైతు తమ పంటలను విపత్తుల నుండి రక్షించుకోవడానికి. సుకృతిని కొనుగోలు చేయడానికి అంకితమైన హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయవచ్చు, వ్యక్తిగత సమావేశాన్ని షెడ్యూల్ చేయవచ్చు.
 
ఇదిలా ఉండగా, తుఫాను, ముంపు (హైడ్రోఫిలిక్ పంటలకు వర్తించవు), వరదలు, వడగళ్ల వాన, చిన్నపాటి ప్రమాదాలలో భూకంపం, కొండచరియలు విరిగిపడటం, పిడుగుపాటు వల్ల అగ్నిప్రమాదం, జంతువుల దాడి (కోతి, కుందేలు, అడవి పంది, ఏనుగు) మరియు విమానాల వల్ల కలిగే నష్టాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు, సుకృతి ఇప్పుడు ఉత్తరప్రదేశ్,  మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, మేఘాలయ, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, కర్ణాటక మరియు  కేంద్రపాలిత ప్రాంతాలు  పుదుచ్చేరి మరియు అండమాన్ & నికోబార్ దీవులలో లభిస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు