పార్లమెంటు తొలి వర్షాకాల సమావేశాలు: 24 మంది ఎంపీలకు కరోనా పాజిటివ్

సోమవారం, 14 సెప్టెంబరు 2020 (17:55 IST)
కరోనావైరస్ విజృంభిస్తున్నప్పటికీ పార్లమెంటు తొలి వర్షాకాల సమావేశం సోమవారం ప్రారంభయయ్యాయి. కరోనా నిబంధనలు ప్రకారం అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించారు. లోక్ సభ, రాజ్యసభ కలిపి రెండు విడతలుగాను సభ ఏర్పాటు చేశారు.
 
ఇందులో లోక్ సభకు ఉదయం, రాజ్యసభకు మధ్యాహ్నం సమయాన్ని కేటాయించారు. ఇందులో మొత్తం 359 మందికి ప్రవేశం కల్పించగా తొలిరోజు 200 మంది మాత్రమే పాల్గొన్నారు. ఇందులో 30 సీట్లను విజిటర్ల కోసం కేటాయించడం జరిగింది. కోవిడ్ కారణంగా నిబంధనల మేరకు భాతికదూరం పాటిస్తూ సీట్లను కేటాయించారు. 
 
కరోనా నిమిత్తం అందరికి టెస్టులు నిర్వహించగా దాదాపు 24 మంది లోక్‌సభ ఎంపీలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కరోనా పాజిటివ్‌గా నిర్ధారించిన వారి వివరాల మేరకు రైల్వే మంత్రి సురేశ్ అంగాడి, బిజెపికి చెందిన మీనాక్షి లక్ష్మీ, అనంతకుమార్ హెగ్డే, ప్రవీణ్ సాహి సింగ్, రీటా బహుగుణ జోషి, కౌసల్ కిషోర్‌తో సహా పలువురు మంత్రులున్నారు. వీరందరిని ఐసోలేషన్లో ఉండవలసినదిగా ప్రకటించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు