భారత్- ఇంగ్లండ్ రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 396 పరుగుల భారీ స్కోరు సాధించింది. వైజాగ్ వేదికగా జరుగుతున్న ఈ టెస్టు మ్యాచ్ లో యశస్వీ జైస్వాల్ (209; 290 బంతుల్లో) డబుల్ సెంచరీతో తొక్కాడు. ఓవర్‌నైట్ స్కోరు 336/6తో శనివారం ఆటను ప్రారంభించిన టీమిండియా మరో 60 పరుగులే చేసింది.