కేరళ రాష్ట్రంలో ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. దళిత సామాజిక వర్గానికి చెందిన ఓ క్రీడాకారిణీపై 62 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణఆనికి పాల్పడిన కామాంధుల్లో కోచ్‌తో పాటు సహా ఆగాళ్లు కూడా ఉన్నారు. బాధితురాలు 13 యేళ్ల వయసులో ఉన్నప్పటి నుంచి ఆమెపై లైంగికదాడి జరుగుతుంది. ప్రస్తుతం ఈ క్రీడాకారిణి వయసు 18 యేళ్లు. ఈ కేసులో ఇప్పటివరకు 15 మందిని అరెస్టు చేశారు. మరో 40 మందిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
అయితే, ఈ విషయాన్ని ఆమె ఎపుడూ తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లలేదు. తండ్రి సోన్‌ఫోన్‌ను బాధిత యువతి వాడుతూ వచ్చింది. దీంతో ఆ ఫోనులోని కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నవారే ఆమెపై ఈ దారుణానికి పాల్పడినట్టు తెలిసింది. కేరళ సమాఖ్య సొసైటీ వలంటీర్లు ఇటీవల క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లగా ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై తీవ్రంగా స్పందించిన మహిళా కమిషన్ మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది.