ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్‌షహర్‌లో ఒక మహిళ తన భర్త గురించి పోలీసులకు చేసిన ఫిర్యాదు చూసి అందరూ షాక్ అయ్యారు. తన భర్త అన్ని హద్దులు దాటి తన స్నేహితులచేత తనపైనే అత్యాచారం చేయించాడంటూ ఆమె ఫిర్యాదు చేసింది. తన భర్త తన స్నేహితులతో తనపై అత్యాచారం చేయిస్తూ అందుకు ప్రతిఫలంగా తన స్నేహితుల నుంచి డబ్బు కూడా తీసుకుంటాడని ఆరోపించింది. అత్యాచారం చేస్తున్న సమయంలో ఆమెకి సంబంధించిన అసభ్యకరమైన వీడియోలు తీసి వారు తన భర్తకు పంపుతారనీ, తన భర్త సౌదీ అరేబియాలో నివసిస్తున్నాడంటూ ఆ మహిళ తన భర్తపై చేసిన ఆరోపణలు విని పోలీసు అధికారులు కూడా షాక్ అయ్యారు.
బాధితురాలు తనపై జరుగుతున్న దాడి గురించి చెబుతూ... తనకు 14 ఏళ్ల క్రితం అకీల్‌తో వివాహం జరిగింది. వివాహం తర్వాత మాకు నలుగురు సంతానం కలిగారు. ఆ తర్వాత డబ్బు సంపాదిస్తానంటూ నాలుగేళ్ల క్రితం సౌదీకి వెళ్లిపోయాడు. సంవత్సరానికి ఒకటి లేదా రెండుసార్లు సౌదీ అరేబియా నుండి వచ్చేవాడు. కొంతకాలం క్రితం, మా పొరుగున ఉన్న ఒక యువకుడు ఇంట్లోకి బలవంతంగా చొరబడి నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. నా భర్తకు ఈ విషయం ఫిర్యాదు చేయగా, అతను నా స్నేహితుడు ఏమి చేయాలనుకుంటే అది చేయనివ్వు అని అన్నాడు. తన స్నేహితుడు దీనికి డబ్బు ఇస్తాడని భర్త ఫోన్‌లో చెప్పాడు. అప్పటి నుండి నా భర్త స్నేహితుడు బలవంతంగా ఇంటికి వచ్చి అసభ్యకరమైన పనులు చేస్తూనే ఉన్నాడు.
ఒక రోజు నా భర్త ఇంటికి వచ్చినప్పుడు, పొరుగున ఉన్న యువకుడిని ఇంటికి తీసుకువచ్చి బలవంతంగా నాపై అత్యాచారం చేయించాడు. ఈ సమయంలో, నా భర్తతో పాటు అతని ఇద్దరు స్నేహితులు కూడా అత్యాచారం వీడియో తీసి, ఎవరికైనా చెబితే ఈ వీడియోను వైరల్ చేస్తామని బెదిరించారు. అనంతరం నా భర్త విదేశాలకు వెళ్లిన తర్వాత కూడా అతని స్నేహితులు ఇంటికి వచ్చి నాపై అత్యాచారం చేస్తున్నారు. ఈ విషయాన్ని నా అత్తమామలకు చెప్పినప్పుడు, నాకు మద్దతు ఇవ్వడానికి బదులుగా వారు నన్ను బెదిరించారు." అని వెల్లడించింది.
తన భర్తను, అతని స్నేహితులను శిక్షించాలని, తనకు న్యాయం చేయాలని బాధితురాలు డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం పోలీసులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ మొత్తం విషయంపై బులంద్‌షహర్ నగర ASP మాట్లాడుతూ, కొత్వాలి నగర్ ప్రాంతంలో ఒక మహిళ తన భర్త, అతని స్నేహితులపై ఆరోపణలు చేసింది. లిఖితపూర్వకంగా ఫిర్యాదు కూడా ఇచ్చింది. ఈ విషయంపై దర్యాప్తు జరుగుతోంది అని చెప్పారు.