మోదీ ఆహ్వానం మేరకు.. భారత్‌కు శ్రీలంక అధ్యక్షుడు

గురువారం, 28 నవంబరు 2019 (14:02 IST)
రెండు రోజుల పర్యటనలో భాగంగా నేడు భారత్​కు రానున్నారు శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు భారత్​లో పర్యటించనున్నారు. 
 
శుక్రవారం రాష్ట్రపతి భవన్​లో రాజపక్స గౌరవార్థం సత్కార కార్యక్రమం నిర్వహించనున్నారు. అదే రోజున మోదీ, రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​తో భేటీ కానున్నట్లు విదేశాంగ మంత్రి జయ్​శంకర్​ వెల్లడించారు.
 
మోదీతో కలిసి ఇరు దేశాల మధ్య అభివృద్ధి, శాంతి, భద్రత వంటి అంశాలు మరింత బలోపేతం చేసే దిశగా చర్చలు జరగనున్నాయి. లంక ఎన్నికల ఫలితాల అనంతరం ఆదివారం నాడు ప్రధాని మోదీ స్వయంగా రాజపక్సకు ఫోన్​ ద్వారా భారత ప్రజలందరి తరపున శుభాకాంక్షలు తెలిపారు. 
 
రాజపక్స నాయకత్వంలో లంకలో శాంతి భద్రతలు మెరుగుపడాలని ఆకాంక్షించారు మోదీ. రాజపక్స నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఇదే ఆయనకు తొలి అధికారిక విదేశీ పర్యటన.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు