దక్షిణ కొరియా దిగ్గజం శామ్‌సంగ్ భారత మార్కెట్లోకి కొత్త ఫోనును ఆవిష్కరించనుంది. రెండు మిడ్‌రేంజ్ ఫోన్లను ఇది విడుదల చేయనుంది. ఈ క్రమంలో గెలాక్సీ ఏ21ఎస్ మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇప్పటికే వీటిని యూరప్ మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఇందులో 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమొరీ, 6జీబీ -64జీబీ మెమొరీతో రూ.16,499, రూ.18,499 ధరల్లో రిటైల్ స్టోర్లు, ఆన్‌లైన్ పోర్టల్‌లో అందుబాటులో ఉంటాయని శామ్‌సంగ్ ఓ ప్రకటనలో తెలిపింది.
బ్లాక్, వైట్, బ్లూ కలర్స్‌లో మోడల్స్ ఉన్నాయని శామ్‌సంగ్ వెల్లడించింది. ఇంకా 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్, 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2-మెగాపిక్సెల్ మైక్రోలెన్స్ ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు భాగంలో 13 మెగాపిక్సల్ కెమెరా, ఫాస్ట్ చార్జింగ్, 5,000 బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో పాటు ఫేస్అన్ లాక్ ఉందని, డాల్‌బీ అట్మాస్ సపోర్ట్ ఉందని వివరించింది.
మైక్రోఎస్డీ స్లాట్
రియర్ కెమెరా సెటప్‌లో 48-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్
4జీబీ-64జీబీ, 6జీబీ-64జీబీ మొమొరీతో 512బీజీ వరకు స్టోర్‌ను విస్తరించుకోవచ్చు.