ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సూటిగా ఓ ప్రశ్న సంధించారు. ఢిల్లీ గడ్డపై ప్లాంట్ లేకపోతే.. రాష్ట్రానికి ఆక్సిజన్ అందదా సార్ అంటూ నిలదీశారు. పైగా, ఢిల్లీ రాష్ట్రానికి వచ్చే ఆక్సిజన్ ట్యాంకర్ లారీ ఆగిపోతే తాను ఎవరికి ఫోన్ చేయాలో చెప్పండంటూ ప్రశ్నించారు. ప్రధాని మోడీని ఉద్దేశించిన కేజ్రీవాల్ అడిగిన ప్రశ్నలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
సర్, దయచేసి ట్రక్కులు (ఆక్సిజన్ తీసుకెళ్లే ట్యాంకర్లు) ఆగిపోతే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఫోన్ చేయండి.. తద్వారా ఆక్సిజన్ ఢిల్లీకి చేరుకుంటుంది అని పేర్కొన్నారు. సంక్షోభాన్ని పరిష్కరించడానికి జాతీయ విధానానికి ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.