కాగా, ఈ ఘటనపై డిప్యూటీ సీఎం కవెల్కర్ స్పందించారు. తన ఫోన్‌ను ఎవరో హ్యాక్ చేశారని, వారిని పట్టుకోవాలని శిక్షించాలని కోరారు. ఈ మేరకు సైబర్ సెల్ విభాగానికి ఫిర్యాదు చేశారు. 'నేను చాలా వాట్సాప్ గ్రూపులలో మెంబర్‌గా ఉన్నాను. ఫోన్ హ్యాక్ చేసిన వాళ్లు కావాలనే 'విలేజెస్ ఆఫ్ గోవా' గ్రూపులో ఆ క్లిప్‌ను ఫార్వర్డ్ చేశారు. మిగతా ఏ గ్రూప్‌కు ఈ క్లిప్ పంపలేదు.
ఆ క్లిప్ గ్రూప్‌లో ఆదివారం రాత్రి 1:20 గంటలకు ఫార్వర్డ్ అయింది. ఆ సమయంలో నిద్రపోతున్నాను. గతంలో కూడా నా పేరును, నా పరువును కించపరచడానికి ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి. నేరపూరితంగా కావాలనే నా ఫోన్ హ్యాక్ చేసిన దుర్మార్గులపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. రాజకీయ ప్రత్యర్థులు నన్ను ఎదుర్కోలేక ఈ పని చేశారు' అని కవేల్కర్ చెప్పుకొచ్చారు. ఈ వ్యవహారంతో ఆయన వివాదంలో చిక్కుకున్నారు.