కోటి ఇళ్లకు 300 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితం

సెల్వి

గురువారం, 1 ఫిబ్రవరి 2024 (13:41 IST)
కోటి ఇళ్లకు 300 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రూఫ్ టాప్ సోలారైజేషన్ ద్వారా ఉచితంగా విద్యుత్ అందిస్తామని తెలిపారు. సోలారైజేషన్ ద్వారా రూ.15 వేల నుంచి రూ.18 వేల వరకు ఆదా అవుతుందని వివరించారు. 
 
రూఫ్ టాప్ సోలారైజేషన్ ద్వారా ఉత్పత్తి అయినదాంట్లో మిగులు విద్యుత్ ను డిస్కమ్ లకు విక్రయించవచ్చని తెలిపారు. గ్రామీణ ఉపాధి హామీ: రూ.86 వేల కోట్లు కేటాయించినట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. సెమీ కండక్టర్స్‌, డిస్‌ప్లే ఎకో వ్యవస్థల తయారీకి రూ.6,903 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు