దొంగతనం చేసే ఓ దొంగ.. కత్తిని చూపి డబ్బు, నగలతో పాటు మహిళల శీలాన్ని కూడా దోచుకున్నాడు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 50 మంది మహిళలపై ఓ దొంగ అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. చెన్నై సైదాపేటలో పోలీసులు గురువారం రాత్రి అరివళగన్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద జరిపిన విచారణలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. అతనిపై ఇప్పటికే పలు దోపిడీ కేసులున్నాయి.
కృష్ణగిరికి చెందిన అరివళగన్ (27) డిగ్రీ పూర్తి చేసి బెంగళూరులోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేసేవాడు. ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి చెన్నైకి చేరుకున్న అతడు దోపిడీలు చేయడమే పనిగా పెట్టుకున్నాడు. ఓసారి ఓ ఇంటికి దోపిడీ చేసేందుకు వెళ్లిన అరివళగన్ ఆ ఇంట్లో ఓ మహిళపై కత్తిని చూపి బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఇదే తరహాలో అనేక దోపీడీలకు పాల్పడిన అరివళగన్ ఆ ఇంట వుండే మహిళల నోటిని కట్టేసి.. కత్తిని చూపి బెదిరించి ఈ అకృత్యానికి పాల్పడేవాడని.. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 50మంది మహిళలపై అరివళగన్ అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఆ మహిళల వద్ద రహస్యంగా విచారణ చేపట్టనున్నట్లు పోలీసులు వెల్లడించారు.