ఇదేంటి.. మహిళలు దర్శించుకుంటే.. ఆలయాన్ని శుద్ధి చేస్తారా?

బుధవారం, 2 జనవరి 2019 (13:40 IST)
శబరిమలలో ఇద్దరు మహిళలు ప్రవేశించడంతో పూజారాలు ఆలయానికి తాళం వేశారు. శబరిమలలో ఇద్దరు మహిళలు స్వామిని దర్శించుకున్నారన్న వార్త దావానలంలా వ్యాపించడంతో దేశవ్యాప్తంగా అన్ని అయ్యప్ప ఆలయాలను మూసివేసినట్లు తెలుస్తోంది.


తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న ఆలయాలను మూసివేయగా, సంప్రోక్షణల అనంతరం శబరిమలలో స్వామి గర్భగుడి తలుపులు తెరిచిన తరువాతనే ఆలయాలను తెరవాలని గురుస్వాములు పిలుపునిచ్చారు. 
 
ఇక మహిళలు అయ్యప్ప స్వామిని దర్శించుకోవడంపై భూమాతా బ్రిగేడ్ కార్యకర్త తృప్తీ దేశాయ్ హర్షం వ్యక్తం చేశారు. ఇద్దరు మహిళలను స్వామి సన్నిధికి పంపిన కేరళ సర్కారుకు కృతజ్ఞతలు తెలిపిన ఆమె, అతి త్వరలో తాను కూడా ఆలయానికి వెళ్లి స్వామిని దర్శించుకుంటానని స్పష్టం చేసింది.

కానీ మహిళల ప్రవేశం తరువాత గర్భగుడి తలుపులు మూసివేయడం, శుద్ధి చేయాలని నిర్ణయించడాన్ని ఆమె తప్పుబట్టారు. ఇది యావత్ భారత మహిళలకే అవమానమని ఫైర్ అయ్యారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు