డాన్స్ చేస్తూ కుప్పకూలి యువతి మృతి (Video)

ఠాగూర్

ఆదివారం, 9 ఫిబ్రవరి 2025 (22:07 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని విదిషలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. తన సోదరి పెళ్ళి వేడుకలో స్టేజీపై డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అక్కడే ఉన్న బంధువులు ఆమెను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించాయి. దీనికి సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  
 
ఇటీవలికాలంలో ఇలాంటి సంఘటనల తరచుగా జరుగుతున్న విషయం తెల్సిందే. అనేక మంది యువతీ యువకులు డ్యాన్సులు చేస్తూ, క్రికెట్ ఆడుతూ ప్రాణాలు గుండెపోటుతో కుప్పకూలిపోతున్న విషయం తెల్సిందే. 


 

డాన్స్ చేస్తూ కుప్పకూలి యువతి మృతి

మధ్యప్రదేశ్ - విదిషలో తన సోదరి పెళ్లి వేడుకల్లో స్టేజీపై డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన యువతి

అక్కడే ఉన్న బంధువులు ఆమెను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించిన వైద్యులు pic.twitter.com/y2Y5Z74qYJ

— Telugu Scribe (@TeluguScribe) February 9, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు