హైదరాబాద్‌లో చిన్నారి కిడ్నాప్‌కు గురైంది. రోడ్డుపై ఆడుకుంటున్న బాలికను ఓ ఆగంతకుడు ఆటోలో ఎక్కించుకుని తీసుకెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. వివరాల్లోకి వెళితే.. ప్రియాంక అనే మహిళ తన సోదరుడితో కలిసి హైదరాబాద్ బేగంబజార్ ఛత్రి ప్రాంతంలో నివసిస్తోంది.