తెలంగాణాలో నిరుద్యోగులకు శుభవార్త

ఆదివారం, 13 జూన్ 2021 (10:48 IST)
తెలంగాణ రాష్ట్రలో నిరుద్యోగులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్వరలోనే 20 వేల పోలీసు పోస్టులను భర్త చేయనున్నట్టు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. సంగారెడ్డిలో కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని శనివారం ప్రారంభించిన మంత్రి అనంతరం మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.
 
పోలీసు శాఖలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసినట్టు చెప్పారు.రాష్ట్రంలో శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు. పోలీసు శాఖలో ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టినట్టు మహమూద్ అలీ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు