Ajay Dishan, Dhanush, Lakshmi Manchu, Sunil, Vijay anthony
ఈ మధ్య కొన్ని సినిమాల టైటిల్స్ నేటి ట్రెండ్ కు తగినట్లు వారి టెక్నికల్ లాగ్వేజ్ కు అర్థమయ్యేలా పేర్లు పెడుతున్నారు. ఆ కోవలోనిదే తమిళ సినిమా పూకీ. అయితే ఈ టైటిల్ కు తెలుగులో విమర్శలు రావడంతో దానిని బూకీ పేరు మార్చారు. తమిళంలో ఈనెల 2వ తేదీన ప్రారంభించగా తెలుగులో సోమవారంనాడు రామానాయుడు స్టూడియలో బూకీ ప్రారంభమైంది. బూకీ అంటే స్నేహితుడు, ప్రేమికుడు అని అర్థం.
ముహూర్తపు సన్నివేశానికి సత్య దేవ్ ఫస్ట్ క్లాప్ కొట్టారు. సి కళ్యాణ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మంచు లక్ష్మి స్క్రిప్ట్ అందించారు. విజయ్ ఆంథోని, రామాంజనేయులు గౌరవ దర్శకత్వం వహించారు.
అజయ్ దిషన్, ధనుష హీరో హీరోయిన్స్ గా గణేష్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'బుకీ'. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, శరవంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్స్ పై రామంజేయులు జవ్వాజీ నిర్మిస్తున్నారు. విఎఎఫ్సి ప్రజెంట్ చేస్తున్నారు.
ఈ చిత్రంలో పాండియరాజన్, సునీల్, లక్ష్మి మంచు, ఇందుమతి, వివేక్ ప్రసన్న కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ ఆంటోని మ్యూజిక్ అందిస్తున్నారు.
విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ.. ఈ సినిమా షూటింగ్ ని ఆల్రెడీ మొదలుపెట్టాం. సినిమా పుటేజ్ చూశాను. చాలా అద్భుతంగా ఉంది. . డైరెక్టర్ చంద్ర డాక్టర్ సలీం సినిమాకి కెమెరామెన్ గా వర్క్ చేశారు. బుకీ మంచి కమర్షియల్ సక్సెస్ అవుతుందని నమ్మకం ఉంది. ఫిబ్రవరిలో సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము అన్నారు.
హీరో అజయ్ దిషన్ మాట్లాడుతూ.. మార్గన్ సక్సెస్ ఈ సినిమా చేయడానికి మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది. సునీల్, లక్ష్మీ తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. సినిమా చాలా అద్భుతంగా వస్తుంది. ఫిబ్రవరిలో సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది
హీరోయిన్ ధనుష మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. తప్పకుండా ఈ సినిమా మీ అందరిని అలరిస్తుంది
డైరెక్టర్ మాట్లాడుతూ.. డాక్టర్ సలీం సినిమాకి నేను సినిమాటోగ్రాఫర్ గా పని చేశాను. నాకు అవకాశం ఇచ్చిన విజయ్ గారికి థాంక్యూ. డైరెక్టర్ గా బుకి నా ఫస్ట్ సినిమా. విజయ్ ఆంటోనీ గారు లేకపోతే నేను ఉండే వాడిని కాదు. నన్ను బిలీవ్ చేసి ఈ సినిమా ఇచ్చిన నిర్మాత రామ్ గారికి ధన్యవాదాలు. సినిమా చాలా అద్భుతంగా వస్తుంది. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలని కోరుకుంటున్నాను
మంచు లక్ష్మి మాట్లాడుతూ.. అందరికీ యూనివర్సల్ గా అర్థమయ్యే కథ. ఈ సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. డైరెక్టర్ గారికి టీమ్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ . సినిమా అద్భుతమైన విజయం సాధించాలని కోరుకుంటున్నాను
ప్రొడ్యూసర్ రామంజేయులు మాట్లాడుతూ.. ఇప్పుడున్న యూత్ కి అద్భుతంగా కనెక్ట్ అయ్యేలా ఈ స్క్రిప్ట్ ని రెడీ చేసాము. ఈ సినిమాలో మంచి మెసేజ్ కూడా ఉంది. చిన్నలకు పెద్దలకు అందరికీ నచ్చేలా ఉంటుంది. అజయ్ చాలా టాలెంటెడ్. మంచు లక్ష్మి, సునీల్, మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఈ సినిమాలో ఉండడం పెద్ద ఎసెట్. డైరెక్టర్ గారికి చాలా విజన్ ఉంది. ఈ సినిమాకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు.