సినిమా కార్మికుల సమస్యల పరిష్కారం కోసమే నిలబడతామనీ, అందులో ఎటువంటి అపోహకు అవకాశం వుందని నటుడు, నిర్మాత మాదాల రవి స్పష్టం చేశారు. సోమవారంనాడు ఫిలింఛాంబర్ పెద్దల సమక్షంలో చిత్రపురి కమిటీ, అధ్యక్షుడు అనిల్ వల్లభనేని చిత్రపురిలో నూతన ప్రాజెక్ట్ SAPPHIRE SUITE' కు సంబందించిన బ్రోచర్ ను అన్ని విభాగాలకు చెందిన వారు విడుదల చేసారు.
ఈ సందర్భంగా మాదాలరవి మాట్లాడుతూ, చిత్రపురి కూడా ఇండస్ట్రీలో ఓ భాగం. కనుక సినీ కార్మికులకు ఉపయోగపడేలా, సినిమా రంగానికి మంచి పేరు తెచ్చేలా చిత్రపురి కమిటీ పూనుకోవాలి. చిత్రపురి సభ్యులుగా తొమ్మిదివేలమంది వున్నారు. అందులో ఇంచుమించు ఐదు వేల మందికి ఇండ్లను కేటాయించారు. అందులో మిగిలినవారికి కొత్త ప్రాజెక్ట్ లో ప్రాధాన్యత ఇవ్వాలి. ముందుగా వెయింటింగ్ లిస్ట్ లో వున్న నిజమైన సినీకార్మికులకు న్యాయంచేయండి. ఆ తర్వాత కొత్త సభ్యులకు అవకాశం ఇవ్వాలి. ఇందుకు చిత్రపురి కమిటీ ఆదర్శవంతంగా నిలుస్తుంది. చిత్రపురి సభ్యులకు, కార్మిలకు మంచి చేస్తుంది అని ఆశిస్తున్నాం అన్నారు.