సోషల్ మీడియా పుణ్యంతో రకరకాల వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తే మీరూ కూడా ఆశ్చర్యపోతారు. అదేంటంటే.. పంజాబ్‌లోని లూథియానాకు చెందిన గురుదీప్ సింగ్ అనే యువకుడు కొత్తగా పంజాబ్‌లో లండన్ నగరం మోడల్‌ను రూపొందించాడు. వీధులు, వంతెనలు, మెట్రో స్టేషన్లు, రైల్రోడ్ టెర్మినల్స్, ఇతర ముఖ్యమైన ప్రదేశాలతో పూర్తి లండన్ నగరం నమూనాను ఈ వీడియోలో చూడవచ్చు.