Virat Kohli: ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్- విరుష్క వీడియో వైరల్ (video)

సెల్వి

బుధవారం, 5 మార్చి 2025 (15:14 IST)
Virat Kohli
దుబాయ్‌లో ఆస్ట్రేలియాతో బుధవారం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై భారత్ అద్భుతమైన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు రికార్డుల పంట పండించారు. విరాట్ కోహ్లీ కొత్త రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
 
ఆస్ట్రేలియా నిర్దేశించిన 265 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత జట్టు ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకుంది. విరాట్ కోహ్లీ 84 పరుగులు సాధించి కీలక పాత్ర పోషించాడు. అతనికి అక్షర్ పటేల్, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మలు మంచి మద్దతు ఇచ్చారు, వీరంతా జట్టు విజయానికి దోహదపడ్డారు. 
 
కెఎల్ రాహుల్ అద్భుతమైన సిక్స్‌తో భారత్ సులభంగా గెలుపును నమోదు చేసుకుంది. ఈ విజయం తరువాత, భారత ఆటగాళ్ళు, సహాయక సిబ్బంది డ్రెస్సింగ్ రూమ్ లోపల వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ క్రమంలో విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలోకి పరిగెత్తగా... బౌండరీ లైన్ దగ్గర నిలబడి, అతను స్టాండ్స్ వైపు తన భార్య అనుష్క శర్మను కోహ్లీ చూశాడు. అనుష్క అతని కోసం చప్పట్లు కొడుతూ, ఉత్సాహపరిచింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Virat Kohli's reaction to Anushka Sharma after the Victory????????❤️ pic.twitter.com/wKCG9beLgX

— Virat Kohli Fan Club (@Trend_VKohli) March 4, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు