అంతర్జాతీయంగా విమర్శలు వస్తున్నా.. తాలిబన్లు మాత్రం పంథాను మార్చుకోవడం లేదు. తాజాగా దేశంలోని మహిళలకు వర్శిటీ విద్యపై నిషేధం విధించారు. బాలికలు, మహిళలు ఇక యూనివర్శిటీల్లో అడుగుపెట్టకుండా బ్యాన్ విధించింది.
మహిళలకు విద్యాబోధనను వెంటనే నిలిపివేయండని... తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు ఉత్తర్వులు అమలు చేయండని ఆప్ఘనిస్థాన్‍లోని ప్రభుత్వ, ప్రైవేట్ యూనివర్సిటీలకు ఉన్నత విద్యాశాఖ మంత్రి నేదా మహమ్మద్ నదీమ్ లేఖరాశారు. ఈ లెటర్‌ను ఆ శాఖ ప్రతినిధి ట్విట్టర్ లో కూడా పోస్ట్ చేశారు.