బెంగాల్ భవానీపూర్ బైపోల్ : సీఎం మమతా బెనర్జీ గెలుపు లాంఛనమేనా?

బుధవారం, 8 సెప్టెంబరు 2021 (16:03 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని భవానీపూర్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ స్థానం నుంచి ముఖ్యమంత్ర మమతా బెనర్జీ అధికార టీఎంసీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. 
 
అదేసమయంలో ఇక్కడ నుంచి తాము పోటీ చేయడం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. భాజపాకు వ్యతిరేకంగా విపక్షాలు ఐక్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఏఐసీసీ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర పీసీసీ ఛీఫ్ అధిర్ రంజన్ చౌదరి ప్రకటించారు. 
 
'మమతా బెనర్జీపై కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెట్టదు. ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం కూడా చేయదు' అని అధిర్ రంజన్ చౌదరి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు పేర్కొన్నారు. అంతకుముందు కాంగ్రెస్ అభ్యర్థిని బరిలోకి దించే అంశంపై పీసీసీలో మెజారిటీ సభ్యులు అనుకూలంగా ఉన్నారని ఆయన ప్రస్తావించడం గమనార్హం. 
 
మరోవైపు, కాంగ్రెస్ నిర్ణయంపై సీపీఎం నేత సుజన్ చక్రవర్తి స్పందిస్తూ.. 'రాష్ట్రంలో భాజపాకు ప్రత్యామ్నాయం అవసరం కనుక మా పార్టీ తరఫున అభ్యర్థిని నిలబెడతాం' అని అన్నారు. అయితే తమ నిర్ణయాన్ని మార్చుకోమని కాంగ్రెస్ పార్టీకి సూచించలేమని తెలిపారు. అయితే కేంద్రానికి వ్యతిరేకంగా విపక్షాల ఐక్యతను చాటాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ అభిప్రాయానికి వచ్చినట్లు పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు