కర్ణాటక ఎన్నికలే పోలింగ్ శనివారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ పోలింగ్‌లో ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే కాంగ్రెస్ నాయకురాలు, నటి రమ్య మాత్రం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోలేదు. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. ఓటు వేయలేని రమ్య రాజకీయాల గురించి మాట్లాడే నైతిక విలువలను కోల్పోయారని విమర్శించారు.