బోన్‌లెస్ చికెన్ - 250 గ్రా
వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు
నిమ్మరసం - 1 టేబుల్ స్పూన్
పాలు - 1 టేబుల్ స్పూన్
మైదా - 1/2 కప్పు.
తయారీ విధానం.. ముందుగా చికెన్‌ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నీళ్లలో బాగా కడగాలి. తర్వాత కడిగిన చికెన్‌ను ఒక గిన్నెలో వేసి అందులో అల్లంవెల్లుల్లి ముద్ద, నిమ్మరసం, ఉప్పు వేసి 20 నిమిషాలు నాననివ్వాలి.
తర్వాత బ్రెడ్ ముక్కలను బంగారు రంగు వచ్చేవరకు టోస్ట్ చేసి మిక్సీ జార్‌లో వేసి గ్రైండ్ చేసి ప్లేట్‌లో పెట్టుకోవాలి. ఆ తర్వాత బ్రెడ్ పొడితో జీలకర్ర పొడి, గరం మసాలా కలపాలి. తర్వాత గుడ్డును ఒక గిన్నెలోకి పగలగొట్టి అందులో పాలు వేసి గిల కొట్టాలి. తర్వాత ప్లేటులో మైదా వేయాలి.