ఈ కేసు విషయంలో దర్యాప్తు చేసిన ప్రస్తుత పోలీస్ కమీషనర్ ప్రమోద్ కుమార్, డీసీపీ కె. వెంకటలక్ష్మి, ఏసీపీ జీ. శ్యామ్ సుందర్, అడిషనల్ పిపి ఎం. సత్యనారాయణ, ఇన్స్పెక్టర్ జె. శివరామయ్యలతో సహా మొత్తం 12 మంది పోలీసు అధికారులను డీజీపీ ఘనంగా సన్మానించి తగు పురస్కారాలను అందజేశారు.
ఈ కేసులో కీలక పాత్ర వహించిన మాజీ పోలీస్ కమిషనర్ వీ. రవీందర్ ను కూడా అభినందించారు. డిజిపి తో సన్మానం అందుకున్న వారిలో గీసుకొండ ఎస్.ఐ. లు పీ. నాగరాజు, అబ్దుల్ రహీం, హెడ్ కానిస్టేబుళ్లు జీ. విజేందర్, ఎస్.అశోక్ కుమార్, కానిస్టేబుళ్లు జీ. దామోదర్, డీ. కిషన్, జె. లింగయ్య, హోమ్ గార్డ్ జీ. రాజు లున్నారు.