నా పెళ్లికి కంగారేంటి... రానాతో 'ఆ' తరహా సంబంధం లేదు.. : నటి త్రిష

Webdunia
సోమవారం, 1 ఫిబ్రవరి 2016 (13:03 IST)
టాలీవుడ్ యంగ్ హీరో దగ్గుబాటి రానా, చెన్నై బ్యూటీ త్రిషల మధ్య చాలాకాలం నుంచి ప్రేమాయణం సాగుతుందనే ప్రచారం చాలా కాలం నుంచి సాగుతోంది. వీరిద్దరు కలిసి షికార్లు, ఫంక్షన్లకు వెళ్లిన సందర్భాలు అనేకం. గతంలో వీరిరువురి మధ్య ఉన్న సానిహిత్యం చూసి ఈ జంట పెళ్లివరకూ చేరుకుంటుందని చాలామంది భావించారు. దాదాపు మూడేళ్లపాటు అనుబంధం కొనసాగించాక.. ఎందుకో తెలీదు కానీ రానా త్రిషలు కొన్ని కారణాల వల్ల విడిపోయారు. ఇలా విడిపోయి కూడా మూడేళ్లు గడిచిపోయింది. 
 
త్రిషతో బ్రేకప్ అయ్యాక రానా పూర్తిగా కెరీర్‌పై దృష్టి పెట్టాడు. అదే టైంలో వచ్చిన 'బాహుబలి' మూవీ.. రానా కెరీర్‌నే మార్చేసింది. అయితే ఇప్పుడు మళ్లీ త్రిష, రానాలు దగ్గరవుతున్నారంటూ సినీ పండితులు అంటున్నారు. దీనికి కారణం.. వీరిద్దరూ తరచుగా కలిసి కనిపిస్తూ ఉండడమే. దీనిపై త్రిషను కలిసి అడిగితే.. ఆమె కూడా వాస్తవమే అని ఒప్పేసుకుంది.
 
ఇదిలావుంటే అందరితో ఉన్నట్లే రాణాతో కూడా ఉంటున్నా అని చెప్పుడం ఇంకో ట్విస్ట్. అందరి హీరోయిన్స్ చెప్పే విధంగానే మా ఇద్దరి మధ్య స్నేహబంధమే కానీ, ఇతరాత్రా సంబంధాలు లేవనీ తేల్చేసింది. ఈ రిలేషన్‌ని ప్రేమ అనుకోవడం అంతా మీడియా వల్లే జరుగుతుందని విరుచుకుపడింది ఈ చెన్నై బ్యూటీ. ఇంతకీ నీ పెళ్లెప్పుడమ్మా అని అడిగితే 40 ఏళ్లు ఉన్నా ప్రియాంక చోప్రా సినీ పరిశ్రమలో నిలదొక్కుకోలేదా .. నా పెళ్లికి కంగారేంటి అంటూ చెప్పుకొచ్చింది ఈ చెన్నై సుందరి.