2009లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి కాకుండా చెడగొట్టింది తానేనని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కె.ఎ పాల్ చెప్పారు. జగన్ మోహన్ రెడ్డిని సీఎం చేయొద్దని నేనే స్వయంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్‌కు ఫోన్ చేసి మరీ చెప్పాననీ, దాంతో ఆయనకు ముఖ్యమంత్రి పదవి రాకుండా పోయిందన్నారు. అలాగే రోశయ్యను ముఖ్యమంత్రి చేయాలని కూడా తానే సూచన చేశాననీ, ఆ ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రోశయ్యను ఏపీ ముఖ్యమంత్రిగా చేసిందని గుర్తు చేశారు.
ఎన్నికల వేళ కె.ఎ పాల్ చేస్తున్న వ్యాఖ్యలు ఒకింత ఆసక్తికరంగా వుంటున్నాయి. కె.ఎ పాల్ మాట్లాడుతూ... ఏపీలో సుడిగాలి పర్యటనలు చేస్తాను. ఐతే నా సెక్యూరిటీపై ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోంది. సెక్యూరిటీ కావాలని అడిగితే ఒక్క పోలీసును ఇచ్చారు. మరి గతంలో వందలమంది పోలీసులను ఎందుకు ఇచ్చారు. ఇప్పుడు ఒక్క పోలీసును ఎందుకు అంటూ ప్రశ్నించారు.