RTC bus: కదులుతున్న బస్సులో ప్రయాణీకుడికి గుండెపోటు.. ఏమైందంటే?

సెల్వి

ఆదివారం, 29 డిశెంబరు 2024 (20:22 IST)
కదులుతున్న బస్సులో గుండెపోటుతో ఒక ప్రయాణీకుడు మరణించాడు. ఆదివారం కరీంనగర్ నుండి బండలింగపూర్ వెళ్తున్న టీజీఆర్టీసీ బస్సులో ఈ సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. 60 సంవత్సరాల వయస్సు గల ఒక ప్రయాణీకుడు ఛాతీ నొప్పితో బాధపడ్డాడు. 
 
డ్రైవర్ నేరుగా బస్సును గంగాధర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. అయితే, బస్సు ఆసుపత్రికి చేరుకునే లోపే అతను ప్రాణాలు కోల్పోయాడు. మరణించిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు జరుపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు