మే నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. మే 2వ తేదీన అమరావతికి వచ్చే ఆయన రాజధాని అమరావతి పునర్‌నిర్మాణంలో పాలుపంచుకోనున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. వచ్చే మూడేళ్ళలో శాశ్వత సచివాలయం, అసెంబ్లీ, కోర్టు, రహదారులు పూర్తి చేయాలని ఆయన అధికారులను కోరారు.