దేశంలోని చైనా పౌరులకు ట్యాక్సీ సేవలు బంద్ : ట్రావెల్ అసోసియేషన్

బుధవారం, 1 జులై 2020 (10:04 IST)
చైనా సైనికులు పాల్పడిన అకృత్యంపై దేశ పౌరులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇప్పటికే చైనా వస్తువుల వినియోగం, కొనుగోలుపై నిషేధం విధించాలన్న డిమాండ్లు పుట్టుకొస్తున్నాయి. ఇందులోభాగంగా కేంద్రం 59 రకాల సోషల్ యాప్స్‌పై నిషేధం విధించింది. 
 
ఈ నేపథ్యంలో దేశంలోని చైనా పౌరులకు ట్యాక్సీ సేవలు అందించబోమని టూర్ అండ్ ట్రావెల్ అసోసియేషన్ స్పష్టం చేసింది. తమ ట్యాక్సీలలో చైనా పౌరులను ఎక్కించుకునే ప్రసక్తే లేదని అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కమల్ చిబ్బర్ పేర్కొన్నారు. 
 
తమ అసోసియేషన్‌లో 500 మందికిపైగా ట్యాక్సీ ఆపరేటర్లు, ట్రావెల్ యజమానులు భాగస్వాములుగా ఉన్నారన్న ఆయన.. చైనీయులకు సేవలు అందించకూడదని నిర్ణయించినట్టు తెలిపారు. 
 
అంతేకాదు, వారి వాహనాలపై ఇందుకు సంబంధించిన నోటీసులను కూడా అతికిస్తున్నారు. కాగా, ఢిల్లీ హోటల్ అసోసియేషన్ ఇప్పటికే ఇలాంటి నిర్ణయం తీసుకుంది. ఢిల్లీల చైనీయులకు ఎలాంటి వసతి కల్పించరాదని నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు