మరికొన్ని గంటల్లో సాఫీగా ముగియాల్సిన పెళ్లి ఒక్క క్షణంలో ఆగిపోయింది. పెళ్లి మండప వేదికపై వరుడు తన స్నేహితులతో కలిసి 'ఛోళీకే పీఛే క్యాహై' అనే పాటకు వరుడు డ్యాన్స్ చేశాడు. ఇది చూసిన వధువు తండ్రికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అంతే.. పెళ్లిని రద్దు రద్దు చేస్తున్నట్టు ప్రకటించాడు. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
'ఛీ ఛీ.. ఆ పాటేంటి, నీ డ్యాన్స్ ఏంటి' అని మండిపడుతూ పెళ్లిని రద్దు చేశాడు. ఇలాంటి పాటకు రోడ్డు మీద తైతక్కలాడే వ్యక్తికి తన కూతురును ఇచ్చి పెళ్లి చేయలేనని తేల్చిచెప్పాడు. ఆ తర్వాత ఎవరు ఎంతగా సర్దిచెప్పాలని చూసినా ఆయన వినిపించుకోలేదు. తండ్రి నిర్ణయంతో చేసేదేంలేక వధువు కన్నీళ్లతో వేదిక దిగిపోయింది. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
ఈ సంఘటనకు సంబంధించిన పేపర్ క్లిప్పింగ్‌ను షేర్ చేస్తూ.. వధువు తండ్రి చేసింది కరెక్టే, పెళ్లి రద్దు చేయకుంటే రోజూ ఆ డ్యాన్స్ చూడాల్సి వచ్చేదని కొందరు, ఇది అరేంజ్ డ్ మ్యారేజ్ కాదు, ఎలిమినేషన్ రౌండ్ జరుగుతోందని మరొకరు కామెంట్ చేశారు. ఇంకొకరు మాత్రం పెళ్లికొడుకును సమర్థిస్తూ.. ఛోళీకే పీఛే సాంగ్‌కు ఉన్న ఊపు అలాంటింది, ఆ పాట ప్లే చేస్తుంటే ఎవరైనా సరే డ్యాన్స్ చేయాల్సిందే. నా పెళ్లిలో ఆ పాట పెడితే నేను కూడా డ్యాన్స్ చేస్తానని కామెంట్ చేశారు.